రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం

రోస్టర్ విధానంతో మాలలకు అన్యాయం

ఓయూ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణ చట్టం ద్వారా రోస్టర్​ విధానంతో మాలలకు అన్యాయం జరుగుతోందని ఆల్​ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షుడు నామా సైదులు అన్నారు. ఆదివారం ఏఐసీసీ ఎస్సీ కమిషన్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్ ను కలిసి రోస్టర్ విధానం వల్ల  మాల విద్యార్థులు, ఉద్యోగులకు జరిగే నష్టాలపై వివరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీలోని గ్రూప్ త్రీలో చేర్చిన 26 కులాల విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి రోస్టర్ విధానాన్ని సవరించేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, కార్తీక్, రేణు, సంతోష్, ప్రవీణ్ పాల్గొన్నారు.