మాళవిక మాస్‌‌‌‌ ట్రీట్ 

మాళవిక మాస్‌‌‌‌ ట్రీట్ 

ప్రభాస్‌‌‌‌ సినిమా ‘ది రాజా సాబ్‌‌‌‌’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక మోహనన్.  తెలుగులో ఆమెకు ఇది తొలిచిత్రమే అయినా, అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. తన అందానికి, అభినయానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అదీకాక సోషల్ మీడియా ద్వారా అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ ఇస్తూ ఫ్యాన్స్‌‌‌‌ను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల తన అభిమానులతో ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో ముచ్చటించిన ఆమె, పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

‘ది రాజా సాబ్‌‌‌‌’ సెట్స్‌‌‌‌లో ప్రభాస్‌‌‌‌ను ఫస్ట్ టైమ్ కలిసిన క్షణం తనకెంతో ప్రత్యేకమైనదని చెప్పింది. ‘మరో సినిమా షూటింగ్ ముగించుకుని, నిద్ర లేమితో అలసిపోయి, నీరసంగా ఉన్నా. కానీ, ప్రభాస్ గారిని చూడగానే  నాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఎంతో ఆకర్షణీయంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించారు. అంతేకాదు, మంచి మాటకారి కూడా’ అంటూ ప్రభాస్‌‌‌‌పై ప్రశంసలు కురిపించింది.

 ఈ సినిమాలో ప్రభాస్‌‌‌‌తో ఓ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ ఆశించ వచ్చా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా ఉండబోతోంది అని బదులు ఇచ్చింది.  ఎప్పటికప్పుడు తన సిజ్లింగ్‌‌‌‌ ఫొటోషూట్స్‌‌‌‌తో యూత్‌‌‌‌ను ఫిదా చేసే మాళవిక.. ఇలా ఓ మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌లో కనిపించబోతోందని చెప్పడంతో రాజా సాబ్‌‌‌‌లో మాస్‌‌‌‌ ట్రీట్ ఉండబోతోందని సంబరపడుతున్నారు అభిమానులు. ఇటీవల వచ్చిన టీజర్‌‌‌‌‌‌‌‌లోని మాళవిక సీన్స్‌‌‌‌ యూత్‌‌‌‌ను బాగా ఎట్రాక్ట్‌‌‌‌ చేశాయి.  అంతేకాదు తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని అర్థమవుతోంది. మరి తెలుగులో ఫస్ట్ మూవీతో మాళవిక ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి’.