
దసరా(Dasara) సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) సినిమాలో. అవును ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Korayala shiva) దేవర(Devara) అనే పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్(Saif ali khan) విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను ఎంపిక చేశారట మేకర్స్. రీసెంట్ గా దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోను.. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరోసారి దేవర సినిమాలో కూడా తన టైపాఫ్ విలనిజాన్ని పంచడానికి సిద్దమయ్యాడట షైన్ టామ్ చాకో. మరి ఈ సినిమాలో షైన్ టామ్ చాకోను పాత్ర ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల ఆగాల్సిందే.