టాలీవుడ్ హీరోయిన్ మీరా జాస్మిన్ (Meera Jasmine) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం (ఏప్రిల్ 4న) కేరళలోని ఎర్నాకుళంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటు తుది శ్వాస విడిచారు.
జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ. వీరికి ఐదుగురు సంతానం కాగా మీరా జాస్మిన్ అందరిలో కంటే చిన్నది.మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, జాయ్. జోసెఫ్ ఫిలిప్ చాలా సంవత్సరాలు ముంబైలో నివసించేవాడు, తరువాత తిరుమలలో, ఆపై ఎర్నాకులంలోని తన స్వగ్రామానికి మారాడు.
టాలీవుడ్ హీరోయిన్స్ లో మీరా జాస్మిన్ కు మంచి గుర్తింపు ఉంది.తను తెలుగులో యాక్ట్ చేసిన మూవీస్ తక్కువే అయినా అభిమానుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.రీసెంట్ గా ఈ బ్యూటీ విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశం వచ్చినట్టు సమాచారం.