ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Raashii Khanna). నటిగానే కాకుండా అందం విషయంలోనూ అందరి ప్రశంసలు అందుకునే విధంగా..ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలోనే చాలా కష్టపడుతూ వచ్చింది.
తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తెలుగు నేర్చుకుని మరి సినిమాల్లో నటిస్తుంది.దీంతో రాశీ ఇక్కడే హైదరాబాద్ లో ఉండాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ ఇంటి గృహ ప్రవేశం ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే,ఈ అమ్మడుకి ఇప్పటికే హైదరాబాద్ లో మరో రెండిళ్ళు ఉన్నటు సమాచారం. దీన్ని బట్టి చూస్తే తెలుగు స్టార్ డమ్ తో పాటు తెలుగు నేటివిటీని ఎంజాయ్ చేయాలనుకుంటుందన్నమాట.
ప్రస్తుతం రాశి ఖన్నా టైర్ 2 హీరోలకు మోస్ట్ వాంటెడ్‌గా వరుస సినిమాలు చేస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో మాత్రం కాస్త స్లో అయిందని చెప్పాలి.ప్రస్తుతం నీరజ కోన(Neeraja Kona) తెరకెక్కిస్తోన్న తెలుసు కదా (Telusu kada) మూవీలో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నటించనుంది.
అలాగే మరో రెండు తెలుగు సినిమాల చర్చలు జరుగుతున్నాయని..అవేంటో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.వీటితో పాటుగా బాలివుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది.
#RaashiiKhanna buys a new house in Hyderabad.#Yodha Actress along with her family and friends, travelled to Hyderabad for the housewarming ceremony.
— Ashwani kumar (@BorntobeAshwani) April 4, 2024
The pictures show Raashii performing the housewarming in an Indian outfit. She is accompanied by her mother and some of her… pic.twitter.com/GA2b2dutih