సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ సీనియర్ నటి R.సుబ్బలక్ష్మి (87) (Subbalakshmi) మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బలక్ష్మి నిన్న రాత్రి గురువారం (నవంబర్ 30న) కొచ్చి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని ఆమె మనవరాలు సౌభాగ్య వెంకటేష్ తన ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా తెలిపారు. “నేను తనను కోల్పోయాను. గత 30 సంవత్సరాలుగా తనే నా బలం, ప్రేమ. మా అమ్మమ్మ, నా సుబ్బు, నా బిడ్డ ” అంటూ సుబ్బలక్ష్మి ఆసుపత్రిలోని బెడ్పై ఉన్న ఫోటోను పంచుకున్నారు. సుబ్బలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. 

ఇండస్ట్రీలో నటి సుబ్బలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 70 కి పైగా మూవీస్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కళ్యాణ రాముడు, ఏ మాయ చేశావే మూవీలో నటించారు సుబ్బలక్ష్మి. ఏ మాయ చేశావే మూవీలో సమంతకు అమ్మమ్మ పాత్రలో నటించింది. చివరగా విజయ్ నటించిన బీస్ట్ మూవీలో కనిపించింది.

నటి సుబ్బలక్ష్మి వెండితెరపైనే కాకుండా పలు సీరియల్లో కూడా నటించింది. అంతేకాకుండా ఆల్ ఇండియా రేడియోలో దక్షిణాది రాష్ట్రం నుంచి కంపోజర్ గా పనిచేసిన  తొలి మహిళగా ఆమె  రికార్డు క్రియేట్ చేశారు. సుబ్బలక్ష్మి డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పేరు సంపాదించుకుంది.