Malavika Menon: ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన సౌత్ బ్యూటీ.. మరి మేకర్స్కి ఓకేనా!

Malavika Menon: ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన సౌత్ బ్యూటీ.. మరి మేకర్స్కి ఓకేనా!

మళయాళ బ్యూటీ మాళవిక మీనన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. కథ డిమాండ్ చేస్తే రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ చేయడానికి కూడా సిద్ధమే అంటూ మేకర్స్ కు ఛాలెంజ్ విసిరింది. దీంతో..ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మాళవిక మీనా చేసిన ఈ కామెంట్స్ కి మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మాళవిక మీనన్ మళయాళ ఇండస్ట్రీకి చెందిన నటీ. 2011 నిద్ర అనే మలయాళ సినిమాతో ఆమె వెండితెరకి పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగు తమిళ భాషల్లో కూడా ఆమె హీరోయిన్ గా నటించారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులోల్ భాగంగా ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను ఇప్పటివరకు మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. మలయాళ ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు.

తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో అవకాశాలు చాలానే ఉంటాయి. అయితే.. నేను ఇప్పటివరకు గ్లామర్ షో గానీ, లిప్ లాక్ సన్నివేశాల్లో గానీ నటించలేదు. కథ డిమాండ్‌ చేస్తే ఆలాంటి సీన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి అభ్యంతరం లేదు.. అంటు కామెంట్ చేశారు మాళవికా మీనన్‌. మరి ఇకనైనా ఆమెకు సినిమాల్లో వరుస అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.