Bramayugam Movie OTT: ఓటీటీలోకి వచ్చిన.. బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్

Bramayugam Movie OTT: ఓటీటీలోకి వచ్చిన.. బ్లాక్ అండ్ వైట్ హారర్ థ్రిల్లర్

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) హీరోగా ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన  మూవీ భ్రమయుగం (Bramayugam). ఈ పీరియాడిక్‌ హారర్ థ్రిల్లర్‌ తెలుగులో ఫిబ్రవరి 23న రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.

బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లతో పాటు ఆడియన్స్ కి థ్రిల్లింగ్ కలిగేలా చేసింది. ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులను భయపెట్టడానికి ఇంటి బాట పట్టింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా ఇవాళ (మార్చి15) నుంచి సోనీ లైవ్ (SonyLiv) ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. తమిళ, మలయాళం, కన్నడ మరియు తెలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

ఇప్పటికే ఓటీటీలో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సా ఎక్స్, ది ఎగ్జార్సిస్ట్, ది నన్ 2 సినిమాలు వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వీటి జాబితాలోకి సరికొత్తగా మలయాళ బ్లాక్ బస్టర్ భ్రమయుగం రావడంతో థ్రిల్లర్ ఆడియన్స్ కు పండుగనే చెప్పుకోవాలి. 

72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి..జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. గతేడాది మమ్ముట్టి నటిస్తూ..నిర్మించిన చిత్రం క‌న్నూర్ స్క్వాడ్‌ (Kannur Squad). కేవలం రూ.25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన క‌న్నూర్ స్క్వాడ్‌ మూవీ..వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి కేర‌ళ‌ బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. అలాగే రీసెంట్ ఫిల్మ్ కాదల్ ది కోర్ మూవీ రూ.50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం మమ్ముట్టి టర్బో మరియు బజూకతో పాటు మరో మూవీలో నటిస్తున్నారు.