OTT Malayalam: ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ మూవీ.. ఈ కుర్రాళ్ల కథ అస్సల్ మిస్ కావొద్దు!

OTT Malayalam: ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ మూవీ.. ఈ కుర్రాళ్ల కథ అస్సల్ మిస్ కావొద్దు!

తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే వీపరీతమైన పిచ్చి. వారి అభిరుచికి తగ్గట్టుగానే ప్రతివారం కొత్త సినిమాలు వస్తూ ఆడియన్స్ను తెగ ఉత్సాహపరుస్తాయి. భాషాభావ తేడాల్లేకుండా ప్రతిభాష సినిమాను ఆదరిస్తున్నారు. నచ్చిందంటే చాలు ఆ భాష సినిమాలను వరుసపెట్టి చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఐతే.. మన ప్రేక్షకులు మలయాళం సినిమాల మీద విపరీతమైన క్రేజీ పెంచుకున్నారు.

గతంతో పోలిస్తే, ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​లో రిలీజ్​ అయ్యే మలయాళ సినిమాలకు వ్యూస్​ బాగా పెరుగుతున్నాయి. అందుకు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులే కారణం. ఈ క్రమంలోనే ఇపుడో మలయాళం సూపర్ హిట్ మూవీ మన తెలుగువాళ్ళకు బాగా నచ్చేసింది. అదే మూన్‌వాక్ (Moonwalk). మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం. 

మూన్‌వాక్ ఓటీటీ:

మలయాళంలో తెరకెక్కిన మూన్‌వాక్ మూవీ జూలై 8 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్లో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మైఖేల్ జాక్సన్ పాపులర్ డ్యాన్స్ మూవ్ పేరునే ఈ సినిమాకు పెట్టడమే కాకుండా ఆయన సోల్ ను చూపించారు. 2025 మే 30న మూన్‌వాక్ థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ALSO READ : వివాదంలో 'ఉదయపూర్ ఫైల్స్'.. 150 సీన్స్ తొలగించిన సెన్సార్ బోర్డు !

అంతేకాకుండా మూవీ పాపులర్ రేటింగ్ సైట్ IMDBలో 8 రేటింగ్ దక్కించుకుంది. బ్రేక్ డ్యాన్స్ లవర్స్ను ఈ మూవీ కట్టిపడేస్తుంది. బ్రేక్ డ్యాన్స్ అంటే ప్రాణమిస్తూ, మైఖేల్ జాక్సన్ను ఆరాధించే కొందరు యువకుల సక్సెస్ స్టోరీయే ఈ సినిమా కథ. మరి ఈ మూవీ కథేంటనేది చూద్దాం. 

మూన్‌వాక్ కథ:

ఈ మూవీ 80లనాటి కేరళలోని ఒక చిన్న గ్రామ నేపథ్యంలో సాగుతుంది. జాక్ (అనునాథ్) శిబూ (సిద్ధార్థ్) వరుణ్ (రిషి) షాజీ (మనోజ్) సుదీప్ (ప్రేమ్) అరుణ్ (సుజిత్) అనే కుర్రాళ్ళు ఒకే గ్రామంలో ఉంటారు. వీళ్ళందరూ మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ మరియు అతని శైలినుండి ప్రేరణ పొందుతారు. అలా స్కూల్‌కు వెళ్తూ లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఈ యువకులు డ్యాన్స్ నేర్చుకోవాలని  డిసైడ్ అవుతారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఓ డ్యాన్స్ ట్రూప్ రావడం, వారి డ్యాన్స్తో.. ఈ కుర్రాళ్లు కూడా తమ టీమ్ కి 'మూన్ వాకర్స్' అనే పేరు పెట్టుకుంటారు. కానీ, ఆ తర్వాత టీమ్ లో ఒక్కొక్కరికీ ఒక్కో కష్టం వస్తుంది. ఈ సమయంలో వారు ఎలాంటి అడ్డంకులను అధిగమించారు? ఆ యువకులు తమ లక్ష్యాల కోసం ఏం చేస్తారు? 'మూన్ వాకర్స్'గా పేరు తెచ్చుకోవాలనే వాళ్ల ఫలిస్తుందా? చివరికి ఆ యువకుల జీవితాలు ఏమయ్యాయన్నది మిగతా కథ. 

తక్కువ బడ్జెట్లో గ్రామీణ నేపథ్యం స్టోరీతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు వినోద్ ఏకే. కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్, లవర్స్, పేరెంట్స్, ఎనిమీస్.. అంటూ అన్ని వైపుల నుంచి తనదైన కథను చెబుతూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. క్లైమ్యాక్స్ సినిమా స్థాయిని పెంచేసింది. 

మైకేల్ జాక్సన్:

మూన్‌వాక్ చేసినా.. గిర గిర గుండ్రగా తిరిగినా..మునివేళ్లపై నిల్చున్నా..'అర్రె...మైకేల్ జాక్సన్లా చింపేసినవ్..' అంటరు. అంతలా 'మైకేల్ జాక్సన్' అనే పేరు జనాల బ్రెయిన్లలో ఫీడ్ అయ్యింది. పాప్ మ్యూజిక్ అతని యూనిక్ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా ఊహకందని ఫ్యాన్ ఫాలోయింగ్ని అందించింది. గిన్నిస్ రికార్డులు, గ్రామీ అవార్డులు, బిల్ బోర్డ్ లిస్ట్లు అతని ముందు తలవంచాయి. పాప్ సంగీతంలో రారాజు స్థానాన్ని కట్టబెట్టాయి.

ప్రతీ క్షణం.. ప్రపంచంలోని ఏదో ఒక మూల అతని పాటలు వినిపిస్తూనే ఉంటాయి. మైకేల్ జాక్సన్ ని రోల్ మోడల్ గా ఎంతోమంది భావించి ముందుకెళ్లే వాళ్ళు కోట్లలలో ఉన్నారు. అంతేందుకు.. ఒక మనిషి చనిపోతే ఇంటర్నెట్ క్రాష్ కావడం బహుశా మైకేల్ జాక్సన్ విషయంలోనే జరిగిందేమో!