ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. మూవీలపై నెగెటివ్ రివ్యూలు.. తొమ్మిది మంది అరెస్ట్

ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. మూవీలపై నెగెటివ్ రివ్యూలు.. తొమ్మిది మంది అరెస్ట్

సినిమాలపై రివ్యూ(Cinema Review)లు ఇచ్చేవారిపై దేశంలో మొదటి కేసు నమోదైంది. మలయాళంలో ఇటీవల విదుదలైన రాహెల్ మకాన్ కోరా(Rahel Makan Kora) చిత్ర దర్శకుడు ఉబైనీ(Ubaini) ఇచ్చిన పిర్యాదు మేరకు కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్శకుడు పిర్యాదు మేరకు తన సినిమాకు నెగిటీవ్ రివ్యూ ఇచ్చిన మొత్తం తొమ్మిది మందిపై సెక్షన్ 385, సెక్షన్ 120(O) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసులో యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికగా రివ్యూలు ఇచ్చిన వారిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి సదరు సోషల్ మీడియా ఓనర్ లకు వ్యతరేకంగా సాక్ష్యాలను పోలీసుల ఎదుట సమర్పించారు మేకర్స్. ఇందులో భాగంగా నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా రూ.5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

గతంలో కూడా దర్శకుడు ముబీన్ రవూఫ్ ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో ప్రభావం చూపే వ్యక్తులు, వ్లాగర్లు తన సినిమాపై సమీక్షలను జరుపకుండా ఉండేలా ఆదేశించాలని కేసు నమోదు చేశారు. విడుదలైన తేదీ నుండి కనీసం ఏడు రోజులపాటు ఎలాంటి రివ్యూలి ఇవ్వకూడదని, అది సినిమా ఫలితంపై ప్రభావం చూపిస్తుందని ఆయన పిర్యాదులు పేర్కొన్నారు.  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు దానిపై సుదీర్ఘ విచారణ జరపాలని పోలీసులను కోరింది. అది నిజమే అని తేలడంతో.. అటువంటివారిని అరికట్టేందుకు ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ALSO READ :- జియో 84 డేస్ ప్లాన్ : నెట్ ఫ్లిక్స్ తోపాటు జియో సినిమాలు