
యాంకర్‌గానే కాక నటిగానూ బిజీగా ఉన్న అనసూయకి ఇప్పుడు ఇతర భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే విజయ్ సేతుపతి సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆమె, ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి కూడా పరిచయమవుతోంది. అది కూడా మమ్ముట్టి లాంటి మలయాళ సూపర్ స్టార్ సినిమాతో కావడం విశేషం. ఆయన హీరోగా ‘భీష్మ పర్వం’ పేరుతో ఓ సినిమా రూపొందబోతోంది. అమల్ నీరద్ దర్శకుడు. ఈ సినిమాలో అనసూయ ఓ కీలక పాత్ర పోషించబోతోంది. గతంలో ‘యాత్ర’ చిత్రంలో మమ్ముట్టితో కలిసి అనసూయ నటించింది. అందులో తన నటన చూసిన దర్శకుడు అమల్ నీరద్, ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడట. మరోసారి మలయాళ స్టార్‌తో కలిసి నటించడం, మాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం పట్ల అనసూయ సూపర్ ఎగ్జయిటెడ్‌గా ఉంది. ఏప్రిల్ నుండి జరగనున్నఈ మూవీ వర్క్ షాప్‌లో అనసూయ కూడా జాయిన్ అవనుంది.