డిజినిత్ అయ్యత్నాన్ దర్శకత్వంలో రూపొందిందిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ "ఎకో" (Eko). కథనం, మేకింగ్, మిస్టరీ థ్రిల్లర్ టోన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, 2025 బెస్ట్ మలయాళ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే, ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో సందీప్ ప్రదీప్, వినీత్, నరైన్, బిను పప్పు, అశోకన్, బియానా మొమిన్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా కథలోని మిస్టరీ, పాత్రల డెప్త్, ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
"ఎకో" ఓటీటీ:
"ఎకో" మూవీ థియేటర్లో రిలీజై సూపర్ సక్సెస్ అవ్వడంతో, ఓటీటీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడింది. న్యూ ఇయర్ స్పెషల్గా ఇవాళ (డిసెంబర్ 31న) ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ మోస్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలోని వెర్షన్‌తో పాటు హిందీ, తమిళ్, కన్నడలో కూడా డబ్బింగ్/అనువాద వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు ఆడియన్స్ కి ప్రస్తుతం అందుబాటులో లేదు. జనవరి 7 నుంచి తెలుగులో స్ట్రీమింగ్కి సిద్ధం కానుంది.
Chila sathyangal ethra shramichaalum kandethanaakilla pic.twitter.com/9KcZSb43Wp
— Netflix India South (@Netflix_INSouth) December 26, 2025
"ఎకో" కథ:
కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని మంచుతో నిండిన కొండల ప్రాంతం "కట్టుకున్ను" లో కథ సాగుతుంది, అక్కడ ఒక వృద్ధ మహిళ మ్లాతి చెత్తతి జీవిస్తుంది. ఆమె కురియాచన్ అనే కుక్కల పెంపకదారుడు భార్య. అయితే, అతను అనుకోకుండా తప్పిపోతాడు. కానీ, అతను ఒక మిస్టీరియస్ గా మిస్ అయ్యాడనే విషయం ఎవరికీ తెలియదు. అతని చుట్టూ చాలా మిస్టరీ, సస్పెన్స్ మరియు సీక్రెట్స్ ఉంటాయి. ఈ సంఘటనతో అక్కడ మరుగుగా ఉన్న నిజాలు బయటపడతాయి.
మరోవైపు, కురియాచన్ భార్య మ్లాతి తన భర్త ఎప్పుడొస్తాడో అన్న ఆశతో ఎస్టేట్‌లో ఒంటరిగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెకు తోడుగా అక్కడే పని చేసే పీయూస్ ఉంటాడు. అయితే ఆ ఎస్టేట్ చుట్టూ ఉన్న కొండల్లో వినిపించే కుక్కల భయంకరమైన అరుపులు ఒక అపశకునంలా అనిపిస్తుంటాయి.
ఇక మరోవైపు, కురియాచన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వ్యాపారవేత్త మోహన్, అతడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అతని ఆచూకీ కోసం వెతుకుతుంటాడు. కురియాచన్ నిజంగా బతికే ఉన్నాడా? లేక ఎస్టేట్‌లో దాగి ఉన్న రహస్యాలే అతడిని మింగేశాయా? అన్న సందేహాలు క్రమంగా బలపడతాయి. మరి కురియాచన్ దొరికాడా? అతని గతం ఏంటి? ఎస్టేట్‌లో దాగి ఉన్న భయానక రహస్యాలుఏమిటి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, ఈ మిస్టరీ-థ్రిల్లర్ ‘Eko’ను తప్పకుండా చూడాల్సిందే.
