సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు.. కేసు పెట్టిన స్టార్ హీరో

సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు.. కేసు పెట్టిన స్టార్ హీరో

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్(Tovino Thomas) పోలీసులను ఆశ్రయించారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న ఓ నెటిజన్ పై ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ కేసులో త్వరితగతిన ఎంక్వైరీ జరియించాలని ఆయన పోలీసులను కోరారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఓ సోషల్ మీడియా వినియోగదారుడు హీరో టోవినో థామస్ కు ప్రతీరోజు అసభ్యకరమైన రీతిలో మెసేజెస్ చేస్తున్నారట. ముందు ఇలాంటివి సహజమే అని లైట్ తీసుకున్నారట ఆ హీరో. కానీ ఆ మెసేజ్లు నిరంతరం వస్తుండటంతో ఎవరో కావాలనే తనని డీఫెమ్ చేయడానికి ప్రయతిస్తున్నారని భావించిన టోవినో థామస్.. ఈ మేరకు పనంగాడు పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ చేశారు. అంతేకాదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎక్కువైందని, అది ఒక స్టేజి వరకు కానీ.. అవి హద్దులు మీరుతున్నాయని, దానిపై అందరు సమిష్టిగా నిలబడి అరికట్టాలని పిటీషన్ లో తెలిపారు ఆ హీరో. అయితే టోవినో థామస్ కు అసభ్యకరమైన మెసేజెస్ పెట్టిన ఆ వ్యక్తి ఎవరూ అనేది ఇంకా తెలియలేదు. 

ఇక టోవినో థామస్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆయన హీరోగా నటించిన 2018 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 2018లో కేరళలో వచ్చిన వరదలా ఆధారంగా వచ్చిన ఈ సినిమా.. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.