మలేషియా మాస్టర్స్ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్.. ఫైనల్లో చైనా షట్లర్ చిత్తు

మలేషియా మాస్టర్స్ విజేతగా హెచ్‌ఎస్ ప్రణయ్.. ఫైనల్లో చైనా షట్లర్ చిత్తు

భారత ఏస్ షట్లర్, తెలుగుతేజం హెచ్‌హెస్ ప్ర‌ణ‌య్ సంచ‌ల‌నం సృష్టించాడు. మ‌లేషియా మాస్టర్స్ సూప‌ర్ 500 టైటిల్ సొంతం చేసుకున్నాడు. కౌలాలంపూర్‌ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. 94 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు. 

యాంగ్, ప్రణయ్ మధ్య తొలి సెట్ హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో యాంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. ప్రణయ్ ఆ అసాధారణ రీతిలో చెలరేగి తొలి గేమ్‌‌ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత రెండో గేమ్‌లో చైనా షట్లర్ ధీటుగా బదులివ్వడమే కాకుండా ప్రణయ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వశం చేసుకున్నాడు. దీంతో తొలి రెండు గేములు 1-1తో సమం కావడంతో ఫలితం డిసైడర్ గేమ్‌‌పై ఆధారపడింది. ఈ సెట్ లో ప్రణయ్ ఎలాంటి తప్పిదాలు చేయకుండా వార్ వన్ సైడ్ చేశాడు. హంగ్ యాంగ్ జోరు కనబర్చినా చాకచక్యంగా ఆడి గేమ్‌ సొంతం చేసుకున్నాడు. ట్రోఫీతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. 

ఇక ఇదే టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లో ఇంటిదారిపట్టగా, శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లోనే తన పోరాటాన్ని ముగించాడు.