కొల్లాపూర్​ ఎంపీపీగా రజిత

కొల్లాపూర్​ ఎంపీపీగా రజిత

కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్ ఎంపీపీగా మాలే రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీడీవో సమావేశ మందిరంలో బుధవారం జడ్పీ  డిప్యూటీ సీఈవో గోపాల్ నాయక్  ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. గత ఎంపీపీ రాజీనామా చేయగా, ఇన్ చార్జి ఎంపీపీగా భోజ్యానాయక్ బాధ్యతలు నిర్వహించారు. 9 మంది ఎంపీటీసీల్లో ఆరుగురు హాజరయ్యారు. అనంతరం ఎంపీపీగా రజిత బాధ్యతలు చేపట్టారు. ఎంపీడీవో పట్టాభి రామారావు, సూపరింటెండెంట్​ శేఖర్ గౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

అయిజ ఎంపీపీగా ప్రహ్లాద రెడ్డి

అయిజ : ఎంపీపీగా మండలంలోని ఉప్పల ఎంపీటీసీ ప్రహ్లాద రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి వైస్  ఎంపీపీ నాగేశ్వర్ రెడ్డి ఇన్​చార్జి ఎంపీపీగా కొనసాగారు. బీఆర్ఎస్  పార్టీ నుంచి ప్రహ్లాద రెడ్డి ఒక్కడే నామినేషన్  వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎంపీపీకి బొకే అందజేసి అభినందించారు. ఎంపీడీవో వెంకటయ్య, ఎంపీటీసీలు పాల్గొన్నారు.