రిపేర్లకు ఎస్టిమేషన్ పంపండి : కలెక్టర్ మనుచౌదరి

రిపేర్లకు ఎస్టిమేషన్ పంపండి : కలెక్టర్ మనుచౌదరి

జవహర్ నగర్, వెలుగు: సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మనుచౌదరి చెప్పారు. శుక్రవారం ఆయన కాప్రా మండలంలోని జవహర్ నగర్ పీహెచ్​సీని పరిశీలించారు. ఏఎన్​సీ కేసులపై ఆరా తీశారు. పరీక్షలకు రాని వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. 

ల్యాబరేటరీని పరిశీలించి రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారో తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మరమ్మతులకు ఎస్టిమేషన్స్ వేసి తనకు పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్​వో ఉమాగౌరి, మెడికల్ ఆఫీసర్ సుష్మ తదితరులు పాల్గొన్నారు.