త్వరలో మల్కాపూర్​టెర్మినల్ ప్రారంభం

త్వరలో మల్కాపూర్​టెర్మినల్ ప్రారంభం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఓసీ) రూ.3,800 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో చేపట్టిన పారాదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుది దశకు చేరుకుందని, వచ్చే ఏడాది డిసెంబరులోపు సరఫరా మొదలవుతుందని సంస్థ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారి తెలిపారు. ఒడిశాలోని పారాదీప్ రిఫైనరీ నుంచి మల్కాపూర్​కు చమురు సప్లై అవుతుందని సంస్థ కొత్త ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్, స్టేట్ హెడ్ బి.అనిల్​కుమార్​చెప్పారు. హైదరాబాద్​సమీపంలోని మల్కాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.611 కోట్ల పెట్టుబడితో 180 వేల కిలో లీటర్ల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్త పెట్రోలియం టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా వచ్చే డిసెంబరులోపు మొదలవుతుందని వెల్లడించారు.  69.35 ఎకరాల విస్తీర్ణంలో స్టోరేజీ టెర్మినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన  తెలిపారు.  

ప్రస్తుతం తెలంగాణలో 94 ఈవీ చార్జింగ్​ స్టేషన్లు ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలోపు వీటి సంఖ్యను 264 కు పెంచుతామని అనిల్​ కుమార్​ అన్నారు. రాష్ట్రంలో రోజూ 6,500 కిలోలీటర్ల పెట్రోల్​, నాలుగు వేల కిలోలీటర్ల డీజిల్​ అమ్ముతున్నామని చెప్పారు.  తెలుగు రాష్ట్రాలలో పెట్రోల్​లో 10 శాతం ఇథనాల్​ కలుపుతున్నామని చెప్పారు. దీనివల్ల ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.  సీబీజీ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటుచేయడానికి  ఏడు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓఐలను జారీ చేశామని వెల్లడించారు. వీటిలో మూడు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా, ఒకటి చొప్పున జనగాం, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.  ‘‘నేలపై మరకలు పడని, తేలికగా ఉండే ఇండేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపోజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిలెండర్​ను కూడా లాంచ్​ చేశాం. వేగంగా గ్యాస్​ డెలివరీ కోసం ఇండేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తత్కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవను తెచ్చాం. కేవలం రెండు గంటలలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ డెలివరీ చేస్తున్నాం. తెలంగాణలో మేం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లం. పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34.6శాతం వాటాను, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 38శాతం వాటాను, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీలో 40శాతం వాటాను సాధించాం. రాష్ట్రంలో మాకు 1,425 రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెట్లు ఉన్నాయి. వీటికి చెర్లపల్లి, రామగుండం టెర్మినల్స్​ నుంచి సరఫరాలు అందుతున్నాయి.  గత మూడు సంవత్సరాలలో తెలంగాణలో 337 రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుట్​లెట్లను  ప్రారంభించాం. మరో  21 సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ అవుట్​లెట్లను ఈ సంవత్సరం ప్రారంభిస్తాం. ప్రస్తుతం 47 సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి”అని అనిల్​ వివరించారు.