పార్టీ మారే ఆలోచన లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి

పార్టీ మారే ఆలోచన లేదు : మాజీ మంత్రి మల్లారెడ్డి
  • మాజీ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: పార్టీ మారే ఆలోచన లేదని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్లారెడ్డికి ఆయన ఇంట్లో అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తన వయసు 73 ఏండ్లు నిండిందని, ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవ అందించానన్నారు. 

రాజకీయమే వద్దనుకుని యూనివర్సిటీలో నెలకొల్పడమే తన ముందున్న లక్ష్యమన్నారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని, రాఖీ రోజు తన విద్యా సంస్థల్లో కీలకమైన ఇంజినీరింగ్ కాలేజి ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు తెలిపారు.