మళ్లీ పెళ్లికి లైన్ క్లియర్.. సినిమాను కలిసి చూడనున్న నరేష్, పవిత్ర

మళ్లీ పెళ్లికి లైన్ క్లియర్.. సినిమాను కలిసి చూడనున్న నరేష్, పవిత్ర

మళ్లీ పెళ్లి సినిమా విడుదలకు అన్ని లీగల్ అడ్డంకులు తొలిగిపోయాయని ఆ సినిమా హీరో, నిర్మాత నరేష్ తెలిపారు. తాము అనుకున్న తేదీకి, చెప్పిన టైమ్ కు థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. మే 26న మళ్లీ పెళ్లి సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తానని నరేష్ ప్రకటించాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో ప్రేక్షకులతో కలిసి నరేష్, పవిత్ర సినిమా చూడబోతున్నారని తెలిపారు. 

అయితే రమ్య రఘుపతి కోర్టులో వేసిన పిటిషన్ ను ఎలా ఎదుర్కొన్నారన్న విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు నరేష్. ఇక మళ్లీ పెళ్లి సినిమాలో తన పాత్ర కూడా ఉందని, వనిత విజయ్ కుమార్ పాత్ర ద్వారా తనను చూపించారని, తన గౌరవానికి భంగం కలిగించేలా సన్నివేశాలు ఉన్నాయనే అనుమానాన్ని ఆమె వ్యక్తంచేశారు రమ్య రఘుపతి. తన వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతూ, సినిమా రిలీజ్ ను అడ్డుకోవాలని ఆమె కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. కానీ చివరి నిమిషంలో సినిమా రిలీజ్ కు ఒకే చెప్పించి కోర్టు