మీ నేతలను క్రమశిక్షణలో పెట్టుకోండి

మీ నేతలను క్రమశిక్షణలో పెట్టుకోండి

మోదీకి ..మల్లికార్జున ఖర్గే లెటర్

న్యూఢిల్లీ: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహల్ గాంధీపై ఎన్డీయే నేతల అనుచిత వ్యాఖ్యలు కరెక్ట్ కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాలని.. హద్దులుదాటి విమర్శలు చేస్తున్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఈమేరకు మంగళవారం ఆయన మోదీకి లెటర్ రాశారు. "రాహుల్‌‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార కూటమి సభ్యులు అత్యంత అభ్యంతరకర కామెంట్లు చేశారు. హింసను ప్రోత్సహించేలా మాట్లాడారు. రైల్వే మంత్రి రవ్‌‌నీత్ సింగ్ బిట్టుతో పాటు యూపీకి చెందిన మంత్రి రఘురాజ్ సింగ్ కూడా రాహుల్ ను 'నంబర్ వన్ టెర్రరిస్ట్'గా సంబోధించారు. మహారాష్ట్రలో  మీ కూటమి ప్రభుత్వంలోని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. రాహుల్ నాలుక కోసి తీసుకొచ్చిన వ్యక్తికి 11 లక్షల రివార్డు ప్రకటించారు. రాహుల్​పై దాడి చేస్తామని ఢిల్లీలోని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బహిరంగంగా బెదిరిస్తున్నారు. ప్రతిపక్షాల పట్ల ఎలా ప్రవర్తించేలో మీ నేతలకు సూచించండి"  అని మోదీకి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు.