వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం

శంషాబాద్ మండల పరిధిలోని హమీదుల్ల నగర్ గ్రామంలో ఆదివారం రోజు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణ మహోత్సవంలో మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పటాలు ఏర్పాటు చేసి అగ్నిగుండాలపై శివసత్తుల నృత్యాలతో అక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోయింది.

అక్కడే ఏర్పాటు చేసిన అగ్నిగుండాలు అందర్నీ అలరించాయి. వైభవంగా కొనసాగిన మల్లన్న కళ్యాణానికి భక్తులు భారీగా చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లోని వందలాది మంది పాల్గొన్నారు. ఈ  వేడుకలో గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్, నవారు కళ్యాణ్ రెడ్డి, శ్రీరాములు యాదవ్, గడం రమేష్ యాదవ్, శేఖర్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, సుధాకర్ రెడ్డి, చిన్న, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, రమేష్  గ్రామస్తులు నేతలు పాల్గొన్నారు.