గొర్రెల లెక్కలు తెలుస్తాయనే ఫైల్స్ కాల్చేశారు: మల్లు రవి

గొర్రెల లెక్కలు తెలుస్తాయనే ఫైల్స్ కాల్చేశారు: మల్లు రవి

న్యూఢిల్లీ, వెలుగు: యాదవులకి గొర్రెల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ చూపిన లెక్కలు బయటపడ్తాయనే ఉద్దేశంతోనే ఆ ఫైల్స్‌‌‌‌ను కాల్చివేశారని ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ ఇవ్వకముందే రూ.22 వేల కోట్లను కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌కు కేసీఆర్ కేటాయించారన్నారు.

ఈ ప్రాజెక్ట్‌‌‌‌తో లక్ష ఎకరాలకు నీళ్లందిస్తామని చెప్పి, సగం నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్ట్‌‌‌‌ బీఆర్ఎస్‌‌‌‌కు ఏటీఎంలా మారిందని ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ పార్టీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకపోతే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు రెండు సీట్లు కూడా రావన్నారు.