దమ్ముంటే రెఫరెండం పెట్టండి: మమత బెనర్జీ

దమ్ముంటే రెఫరెండం పెట్టండి:  మమత బెనర్జీ

సీఏఏ, ఎన్ఆర్​సీపై కేంద్రానికి సవాల్‌‌‌‌

కోల్​కతా: సిటిజన్ షిప్ ఎమెండ్​మెంట్ యాక్ట్​(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్​పై యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో రెఫరెండం నిర్వహించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ ఓటింగ్​లో ఓడిపోతే బీజేపీ అధికారం నుంచి దిగిపోవాలన్నారు. కోల్​కతాలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో ఆమె మాట్లాడారు. సిటిజన్ షిప్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను.. హిందు, ముస్లింల మధ్య జరుగుతున్న గొడవలుగా చిత్రీకరించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘బీజేపీకి ఎన్నికల్లో మెజారిటీ వచ్చిందంటే దాని అర్థం వాళ్లు ఏమైనా చేసేయొచ్చని కాదు. బీజేపీకి నిజంగా దమ్ము ఉంటే.. సీఏఏ, ఎన్ఆర్​సీపై యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో రెఫరెండం నిర్వహించాలి” అని సవాల్ చేశారు. ఎన్ఆర్​సీ, సీఏఏలను వెస్ట్ బెంగాల్​లో అమలు చేయబోమని మరోసారి తేల్చిచెప్పారు.