పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ స్కాంపై దీదీ విచారణ కమిటీ 

పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ స్కాంపై దీదీ విచారణ కమిటీ 

పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ పై విచారణకు ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి మదన్ లోకే ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని నియమించారు. పెగాసిస్ వ్యవహారంలో మొదటి అధికారిక విచారణ కమిటీ ఇదే. దేశ వ్యాప్తంగా విపక్ష నేతలు, రాజకీయవేత్తలు, జర్నలిస్టులు, హక్కుల సంఘ నేతల తదితర వందలాది నేతల ఫోన్ లను హ్యాక్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 

పెగాసస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ను వేస్తుందని తాము భావించామని.. అయితే కేంద్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు మమతా బెనర్జీ. దీంతో తామే విచారణ కమిషన్ ను వేస్తున్నామని చెప్పారు. తాము వేసిన ఈ చిన్న అడుగు ఇతరులను కూడా మేల్కొలుపుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బెంగాల్ లో అనేక మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయని చెప్పారు. మరోవైపు హ్యాకింగ్ కు గురైన వారి లిస్టులోమమత మేనల్లుడు, లోక్ సభ సభ్యుడు అభిషేక్ బెనర్జీ పేరు కూడా ప్రముఖంగా విన్పించింది.