
కోల్‌కతా: కేంద్ర మంత్రి అరూప్ విశ్వాస్ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా చేపట్టిన సురుచి సంఘ దుర్గా పూజ వేడుకలకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పాట రాశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీత్ గంగూలీ పాటను కంపోజ్ చేయగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ ఆ పాట పాడారు. “ఉత్సవ్’’ పేరుతో య్యూట్యూబ్‌లో ఈ పాటను విడుదల చేయగా.. తక్కువ టైంలో చాలా మంది ఆ పాటను చూశారు. “ ఈ పండుగకు ప్రతి ఒకరు ఆహ్వానితులే, ప్రతి ఒకరిది ఈ పండుగ” అని అర్థం వచ్చేలా బెంగాలీలో పాటను చక్కగా రాశారని గంగూలీ అన్నారు. సురుచి సంఘ దుర్గా పూజకు ఐదు సంవత్సరాల నుంచి పాటను కంపోజ్ చేస్తున్నానని, మమత రాసిన పాటను కంపోజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు.