దీదీ కొత్త పథకం…రూ.5కే గుడ్డుతో భోజనం

దీదీ కొత్త పథకం…రూ.5కే గుడ్డుతో భోజనం

పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇవాళ మరో కొత్త పథకానికి పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు రూ. 5 రూపాయలకే భోజనాన్ని అందించేందుకు ‘మా’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

పేదలకు కడుపునిండా భోజనం పెట్టడమే ఈ పథకం లక్ష్యమన్నారు సీఎం మమతా బెనర్జీ. ప్రస్తుతానికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ‘మా కిచెన్లు’ ప్రారంభించామని… త్వరలో ఈ సెంటర్లను మరింతగా పెంచుతామని చెప్పారు. ఈ సెంటర్లలో కేవలం రూ. 5కే భోజనం చేయవచ్చని అన్నారు. మెనూలో అన్నం,పప్పు, కూరగాయలతో పాటు గుడ్డు కూర కూడా ఉండనుంది. ప్రతి భోజనానికి రూ. 15 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు దీదీ. ప్రతీ రోజు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు భోజనాన్ని సరఫరా చేయనున్నారు.