నందిగ్రామ్‌ లాగే సీఎం మమతా బెనర్జీని మళ్లీ ఓడిస్తాం

నందిగ్రామ్‌ లాగే సీఎం మమతా బెనర్జీని మళ్లీ ఓడిస్తాం

పశ్చిమ బెంగాల్ లో  మరోసారి  రాజకీయాలు వేడెక్కాయి.  మూడు అసెంబ్లీ  స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో  ప్రధాన పార్టీలు  వ్యూహ ప్రతివ్యూహాల్లో   బిజీగా ఉన్నాయి. భవానీపూర్ పైనే ప్రధానంగా  చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి సీఎం మమతా బెనర్జీ  పోటీకి దిగుతుండగా.. లాయర్  ప్రియాంక టిబ్రివాల్‌ను ఆమెపై పోటీకి దించుతోంది బీజేపీ. వరుసగా మూడో సారి బెంగాల్‌లో ఒంటి చేత్తో తృణమూల్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన మమతా బెనర్జీని నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సీటులో మాత్రం గెలవనీయకుండా చేసినట్టే.. ఇప్పుడు భవానీపూర్‌‌లోనూ ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతామని వెస్ట్ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ తెలిపారు.

ఎన్నికలకు 20 రోజల లోపే సమయం ఉండడంతో ప్రచారం ప్రారంభించిన దిలీప్ ఘోశ్,  అభ్యర్థి  ప్రియాంక తిబ్రేవాల్.. ఈ రోజు ఉదయం భవానీపూర్‌‌లో మార్నింగ్  వాక్‌లో  వాకర్లతో మాట్లాడారు.  వీధుల్లో నడుస్తూ  ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.  రాజకీయాల్లో  ఏం జరుగుతుందో  చెప్పలేమన్నారు  దిలీప్ ఘోశ్. నందిగ్రాం  లాగే  ఇక్కడ కూడా  సీఎం మమతా బెనర్జీని  ఓడించడానికి  అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. రేపు  నామినేషన్ వేస్తానన్నారు  బీజేపీ అభ్యర్థి  ప్రియాంక తిబ్రేవాల్.  బెంగాల్ ప్రజలు  జీవించే హక్కుల పోరాడుతానని చెప్పారు.