
కోల్ కతాలో భారీ ర్యాలీ తీశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పచ్చదనం, పరిశుభ్రత పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చెట్లను పెంచడం.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వాధికారులు, నేతలతో కలిసి.. ఈ ర్యాలీలో పాల్గొన్నారు మమత బెనర్జీ. కోల్ కతాలోని బిర్లా ప్లానిటోరియం దగ్గర మొదలైన ర్యాలీ.. నజ్రుల్ మంచ్ వరకు కొనసాగింది.