హీరాబెన్‌ మృతిపట్ల సీఎం మమతా బెనర్జీ సంతాపం

హీరాబెన్‌ మృతిపట్ల సీఎం మమతా బెనర్జీ సంతాపం

ప్రధాన మంత్రి తల్లి మరణానికి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ఇంత విషాదంలో ఉన్నప్పటికీ కోల్ కతా లో  మోడీ వర్చ్యువల్ గా వందే భారత్ రైలును ప్రారంభించడం పట్ల ఆమె ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘దయచేసి కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో తెలియడం లేదు. మీ అమ్మ మాకు కూడా అమ్మే అంటూ మోడీని ఉద్ధేశించి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు.

ప్రారంభోత్సవం కంటే ముందు.. కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏర్పాటు చేసిన వేదిక వద్ద జై శ్రీరామ్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో సీఎం మమతా బెనర్జీ వేదికపైకి వెళ్లడానికి నిరాకరించారు. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఒప్పించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి నినాదాలు చేయవద్దని అశ్విని వైష్ణవ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు సుభాష్ సర్కార్ కార్యకర్తలను సముదాయించేందుకు ప్రయత్నించారు. చివరకు వేదిక పక్కనే సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. ఐదు రైల్వే ప్రాజెక్టుల్లో నాలుగింటి పనులను తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించినట్లు చెప్పారు.