వర్సిటీలకు చాన్స్లర్గా సీఎం మమతా బెనర్జీ

వర్సిటీలకు చాన్స్లర్గా  సీఎం మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్ లోని అన్ని వర్సిటీలకు చాన్స్లర్గా సీఎం మమతా బెనర్జీ వ్యవహరించనున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకార్ స్థానంలో వర్సిటీలకు చాన్స్లర్గా మమతా బెనర్జీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించిన బిల్ ను బెంగాల్ అసెంబ్లీలో ఇవాళ పాస్ చేశారు. ప్రస్తుతం చాన్స్లర్గా ఉన్న గవర్నర్ జగదీప్  అన్ని ప్రొటోకాల్స్ ను ఉల్లంఘించినట్లు మమత బెనర్జీ తెలిపారు. 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 182 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. 40 మంది వ్యతిరేకించారు. ఈ బిల్లుతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో రాజకీయ జోక్యం ఎక్కువవుతుందని బీజేపీ ఆరోపించింది.