కరోనాపై పోరు సాగించడానికి నిధులివ్వండి

కరోనాపై పోరు సాగించడానికి నిధులివ్వండి

ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విన్నపం

కోల్‌కతా: కరోనా మహమ్మారిపై పోరును సాగించడానికి నిధులను విడుదల చేయాలని ప్రధాని మోడీని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. అందుకోసం రూ,53 వేల కోట్ల ఫండ్స్‌ను సోమవారం రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా అన్ని రాష్ట్రాలకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌తోపాటు అందించే మిగతా ఫండ్స్‌ను కరోనా మీద పోరాడటానికి కేంద్రం అందిస్తోంది.

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కింద కేంద్రం ఏప్రిల్, మే నెలల్లో విడుదల చేయాల్సిన రూ.4,135 కోట్లను అందించాలన్నారు. అలాగే ఆ ఫండ్స్‌ను రాష్ట్రాలు స్వేచ్ఛగా వాడుకోవడానికి వీలుగా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఆర్‌‌బీఎం) యాక్ట్‌, 2003పై ఉన్న అన్ని కండీషన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ‘బెంగాల్‌లో అంఫాన్ తుఫాను బీభత్సం సృష్టించడంతో రాష్ట్రానికి రూ.35 వేల కోట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. మీరు ఆయా ప్రాంతాలను మీ టీమ్స్‌తో సర్వే చేయించారు. కానీ నిర్ణీత డేట్‌కు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు’ అని మమత పేర్కొన్నారు.