
కోల్ కతా: సిలిగురిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్మును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం (అక్టోబర్ 07) పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తీసుకున్నారు.
ఖగేన్ ముర్ముకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. సోమవారం జలపాయ్ గురిలోని నాగర్ కటలో వరద ప్రభావిత ప్రాంతాలను బీజేపీ నేతలు ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ సందర్శించారు. ఈ సందర్భంగా వారిపై దుండగులు దాడి చేశారు. దీంతో బెంగాల్ ప్రభుత్వం, కేంద్రం మధ్య వివాదం రాజుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీరిపై దాడిని ఖండించారు. ఈ క్రమంలోనే ఖగేన్ ముర్మును ‘దీదీ’ పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్ ను ఆమె పరామర్శించారా లేదా అనేది తెలియడం లేదు. సీఎం మమతా బెనర్జీ ఆస్పత్రి సందర్శనను బెంగాల్ బీజేపీ స్వాగతించింది.