ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ పై మమతా బెనర్జీ ఆగ్రహం 

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ పై మమతా బెనర్జీ ఆగ్రహం 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉద్యోగుల జీతాల విషయంలో రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. డియర్‌నెస్ అలవెన్స్ సమస్యపై ప్రతిపక్షాల మద్దతుతో చేస్తున్న నిరసనలను కొట్టిపడేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను పెంచాలని వస్తున్న డిమాండ్లకు స్పంధించిన మమత.. ఎక్కువ వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవని తేల్చి చెప్పారు. 

ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మమత.. పెన్షనర్లు సహా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నుంచి 3 శాతం డీఏను అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. మమత బడ్జెట్ లో ఉద్యోగుల డీఏ కింద రూ.1.79 కోట్ల మంజూరు చేశారు. వేతంనంతో కూడిన సెలవులు 40 ఇస్తున్నారు. అయినా, డీఏ ఇంకా పెంచాలని డిమాండ్ రావడంతో అసెంబ్లీలో ‘రాష్ట్ర ఖజానాలో నిధులు లేవు. ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని విధాలా సరైనదే. ఇంకా కావాలని డిమాండ్ చేయడం సరికాదు. అయినా కావాలని డిమాండ్ చేస్తే నా తల నరికి తీసుకెళ్లండి’ అని వ్యాఖ్యానించారు.