మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదు

మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదు

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట మార్చారు. నరేంద్ర మోడీ ఈ నెల 30న రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిపారు. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన మమతా.. రెండో రోజే మాట మార్చారు.

బెంగాల్‌ లో జరిగిన హింసలో 54మంది బీజేపీ కార్యకర్తలను రాజకీయ హత్య చేశారంటూ ఆ పార్టీ  అసత్య ప్రచారం చేస్తోందని ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని, బెంగాల్‌లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదని అన్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు, కుటుంబ కలహాల కారణంగానే ఆ హత్యలు జరిగాయని తెలిపారు. ఆ హత్యలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ అసత్య‌ప్రచారాల కారణంగా ప్రమాణస్వీకారానికి హాజరు కావడం లేదని…క్షమించాలంటూ మోడీని కోరారు మమతా బెనర్జీ.

.