ఎన్నికల మేనిఫెస్టోలో మమత వరాల జల్లు

ఎన్నికల మేనిఫెస్టోలో మమత వరాల జల్లు
  • ఏటా 5 లక్షల ఉద్యోగాలు
    స్టూడెంట్లకు రూ.10 లక్షల లిమిట్​తో క్రెడిట్​ కార్డు
  • ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన దీదీ
  • ‘జనరల్​’ వాళ్లకు రూ.6 వేలు.. బీసీలకు రూ.12 వేల సాయం

కోల్‌కతా: ‘‘ఏటా 5 లక్షల ఉద్యోగాలు.. పేదోళ్లందరికీ డబ్బు సాయం.. స్టూడెంట్లకు క్రెడిట్​ కార్డులు.. రైతుకు పెట్టుబడి సాయం..’’ ఇవీ అసెంబ్లీ ఎన్నికల కోసం వెస్ట్​బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కురిపించిన వరాల జల్లు. బుధవారం ఆమె తృణమూల్​ కాంగ్రెస్​ మేనిఫెస్టోను విడుదల చేశారు. 
 

నిరుద్యోగాన్ని తగ్గిస్తం
తమను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే నిరుద్యోగాన్ని తగ్గిస్తామని మమతా హామీ ఇచ్చారు. ఏటా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇంటింటికీ రేషన్​ను అందిస్తామన్నారు. పేదోళ్లందరికీ ఏటా డబ్బుసాయం చేస్తామని చెప్పారు. జనరల్​ కేటగిరీలోని వాళ్లకు ఏటా రూ.6 వేలు, వెనుకబడిన కులాల వారికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఇప్పుడున్న రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని.. రూ.10 వేలకు పెంచుతామని చెప్పారు. స్టూడెంట్లు పెద్ద చదువులు చదువుకునేందుకు వీలుగా రూ.10 లక్షల లిమిట్​తో క్రెడిట్​ కార్డులు ఇస్తామని దీదీ చెప్పారు. దానిపై కేవలం 4 శాతమే వడ్డీ వసూలు చేస్తామన్నారు. 

 

వంద శాతం నెరవేర్చినం
గతంలో ఇచ్చిన హామీలను వందకు వందశాతం నెరవేర్చామని దీదీ చెప్పారు. తాము చేసిన మంచి పనులను ప్రపంచం మొత్తం మెచ్చుకుందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డులు పొందామన్నారు. వంద రోజుల పని కల్పనలో తమ రాష్ట్రమే నెంబర్​1 స్థానంలో నిలిచిందన్నారు. పేదరికాన్ని 40 శాతం తగ్గించామన్నారు. రైతుల ఆదాయాన్ని మూడింతలు చేశామని ఆమె చెప్పారు.