వీల్​చైర్ పైనే 8 కిలోమీటర్ల ప్రచారం

V6 Velugu Posted on Mar 30, 2021

  • వీల్​చైర్ పైనే మమత ప్రచారం
  • నందిగ్రామ్​లో 8 కిలోమీటర్ల మేర రోడ్ షో

కోల్​కతా:  రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం బెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ప్రచార వేగాన్ని పెంచారు. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో వీల్​చైర్ పైనే ఆమె ప్రచారం చేపట్టారు. సోమవారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి నందిగ్రామ్​లో 8 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు చేతులు జోడించి అభివాదం చేశారు. వందల మంది స్థానికులు, తృణమూల్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలింగ్ ముగిసేవరకూ.. మమత నందిగ్రామ్ లోనే ఉంటారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నందిగ్రామ్​లో గురువారం పోలింగ్ జరగనుండగా, మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగియనుంది. మరోవైపు మంగళవారం నందిగ్రామ్​లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
 

Tagged Bjp, west bengal, ELECTIONS, mamata banerjee, Road Show, TMC

Latest Videos

Subscribe Now

More News