మేం మోడీకి నౌకర్లమా?

మేం మోడీకి నౌకర్లమా?

ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి రమ్మంటే అక్కడికివెళ్లడానికి తాము ఆయన సర్వెంట్లం కాదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డా రు.సోమవారం పశ్చిమబెంగాల్ గోపివల్లభ్ పూర్ సబ్ డివిజన్ లోని ఝారాగ్రామ్ లో బహిరంగ సభలోమమతా మాట్లాడారు. “ప్రధాని మోడీ కోల్ కతాలోని ఆఫీసుకు ఫోన్ చేసినప్పుడు నేను ఖరగ్ పూర్లో ఉన్నా. తుఫాన్ సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నా. అందుకే మాట్లాడలేకపోయా. ఎన్నిల ప్రచార సభకోసం కలైకుండలో ల్యాండ్ అవుతున్నానని, అక్కడికి వచ్చి కలవాలని ప్రధాని చెప్పారు. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడానికి మేము ఆయన సర్వెంట్లమా? నేను రెస్పాండ్ కావట్లేదని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎక్స్ పైరీ ప్రైమ్మినిస్టర్ తో నేను వేదిక పంచుకోవాలా” అని ఆమె ప్రశ్నించారు. బెంగాల్ వైపు చూడకండి. కచ్చితంగా ఓడిపోతారని మోడీని హెచ్చరించారు.

దీదీవి అన్నీ రాజకీయాలే: మోడీ
ఫోని తుఫాన్ పై మమత రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని ఆరోపించారు. తుఫాన్ ప్రభావంపై మాట్లాడేందుకు తాను రెండుసార్లు ఫోన్ చేసినా.. స్పందించలేదన్నారు. సోమవారం పశ్చిమ బెంగాల్ లోని తామ్లుక్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. “ఒడిశాలో తుఫాన్ పరిస్థితిని సమీక్షించి తిరిగివచ్చా. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడేందుకు ఫోన్ చేశా. దీదీకి అహంకారం ఎక్కువ. నాతో ఫోన్ లో మాట్లాడలేదు. ఆమె కాల్ కోసంవెయిట్ చేశా. తిరిగి కాల్ చేయలేదు. స్పీడ్ బ్రేకర్ దీదీకి రాజకీయాలే ఎక్కువ ఇష్టం . పశ్చిమ బెంగాల్అధికారులతో మాట్లాడదామని అనుకున్నా.. వాళ్లనుకూడా మాట్లాడనివ్వలేదు” అని ఆరోపించారు.

జైశ్రీరాం
అంటా.. అరెస్టు చేయండి: మోడీ
“జై శ్రీరామ్ అని అంటా .. ధైర్యముంటే అరెస్టుచేయండి” అని మమతా బెనర్జీకి మోడీ సవాలువిసిరారు. ఘటాల్ లోక్ సభ నియోజకవర్గంలోమమతా కాన్వాయ్ వెళ్తుండగా జైశ్రీరామ్ అన్నందుకు ముగ్గురిని పోలీసు కస్టడీలోకి తీసుకోవడాన్నిఝార్ గ్రామ్ ఎన్నికల సభలో ప్రధాని ప్రస్తావించారు. “జైశ్రీరాం అంటే జైలులో పెడుతున్నారు. నేను జైశ్రీరామ్ అంటున్నా. నన్ను జైలులో పెడతారా”అని ప్రశ్నించారు. రామాయణం, మహాభారతంపై సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా మాట్లాడటం కమ్యూనిస్టులకు ఫ్యాషనైపోయిందని విమర్శించారు.

నవీన్ బాబు బాగా ప్లాన్ చేశారు: మోడీ
ఫోని తుఫాన్ ప్రభావాన్ని సమర్థం గా ఎదుర్కొన్నారని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. సోమవారం ఒడిశాలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. తుఫాన్ కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మోడీ”నవీన్ బాబు మంచిగా ప్లాన్ చేశారు. తుఫాన్ నష్టం అంచనా వేసేందుకు త్వరలో కేంద్ర బృందంవస్తుంది. మత్స్య కారులు, బాధిత ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటాం” అని హమీ ఇచ్చారు.