
మమ్ముట్టి సినిమా వస్తోందంటే మలయాళ ప్రేక్షకులే కాదు.. తెలుగు ప్రేక్షకులూ అంచనాలు పెంచుకుంటారు. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. వాటిలో ‘క్రిస్టోఫర్’ మూవీ ఒకటి. బి.ఉన్నికృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మొత్తం ఒక హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. ఆ కేసును ఛేదించే పోలీసాఫీసర్‌గా మమ్ముట్టి కనిపించనున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ రివీలై ఆకట్టుకుంది. ఇప్పుడు మరో లుక్‌ని రిలీజ్ చేశారు.
చేతిలో గన్ పట్టుకుని చాలా సీరియస్‌గా ఉన్నారు మమ్ముట్టి. ‘తనకి న్యాయం అంటే పిచ్చి’ అని పోస్టర్‌పై రాసి ఉండటాన్ని బట్టి ఆయనొక టఫ్ కాప్‌గా కనిపించబోతున్నారని అర్థమవుతోంది. ఇప్పటికే మమ్ముట్టి తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేశారు. నవంబర్‌లో మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.