మీ అప్పు తీర్చలేను.. నా భార్యను వాడుకోండి

V6 Velugu Posted on Jun 10, 2021

కట్టుకున్న వాడిని నమ్మి.. కన్నవాళ్లను వదిలేసి వస్తే.. ఆ కట్టుకున్న వాడే ఆమె పాలిట కసాయివాడుగా మారాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్తే ఆమెను తన స్నేహితుల కోరిక తీర్చాల్సిందిగా ఆజ్ఙాపించాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కడలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

ఎల్ఆర్ పాలయంకు చెందిన ఒక వ్యక్తికి 2018లో 21 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం రెండేళ్ల కొడుకు ఉన్నాడు. పెళ్లి కాకముందు నుంచే ఆ వ్యక్తి మద్యానికి బానిసగా మారి ఏ పనిలో ఎక్కువకాలం ఉండలేకపోయేవాడు. ఈ క్రమంలో గతేడాది కరోనాతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో యువతి భర్త ఏ పని లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. అటు చేతిలో పనిలేకపోవడం.. ఇటు మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఆ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులైన సుందరమూర్తి, మణికందన్‌ల దగ్గర అప్పు చేశాడు. కొంతకాలం తర్వాత అప్పు చెల్లించాలని వారిద్దరూ ఒత్తిడి తెచ్చారు. దాంతో అప్పు తీర్చలేనని భావించిన మహిళ భర్త ఒక నిర్ణయానికి వచ్చాడు. ‘నేను మీ అప్పు చెల్లించలేను. దానికి బదులుగా మీరు నా భార్యను వాడుకోండి’ అని తన స్నేహితులకు ఆఫర్ ఇచ్చాడు.

ఇచ్చిన మాట ప్రకారం మహిళ భర్త ఒకరోజు విటమిన్ ట్యాబ్లెట్ అని చెప్పి ఆమెకు నిద్ర మాత్ర ఇచ్చాడు. దాంతో మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో.. తన స్నేహితులలో ఒకరైన సుందరమూర్తిని అత్యాచారం చేయడానికి పంపించాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన మహిళ.. జరిగింది గ్రహించి తన భర్తను మందలించింది.

మరో సందర్భంలో మహిళ భర్త తన స్నేహితుడైన మణికందన్‌తో కలిసి తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే నిద్రలో ఉన్న తన భార్యను అనుభవించాలని మణికందన్‌ను ఆమె దగ్గరికి పంపించాడు. మణికందన్ అలికిడితో లేచిన మహిళ.. ప్రతిఘటించి తప్పించుకుంది. అనంతరం భర్తపై కర్రతో దాడి చేసింది. ఆ సంఘటన తర్వాత తన కొడుకును తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా కూడా మహిళ భర్త అక్కడికి కూడా వెళ్లి.. తన స్నేహితులకు సహకరించాలని అడిగాడు. దాంతో భర్త ప్రవర్తనతో విసుగుచెందిన మహిళ.. పన్రుతిలోని ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో తన భర్త మరియు అతని ఇద్దరు స్నేహితుల మీద ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అరెస్టు చేశారు.

Tagged tamilnadu, Rape, cuddalore, , man offer to his friends to his wife for rape, alcohol addict, debt settlement

Latest Videos

Subscribe Now

More News