జూబ్లీహిల్స్ బాలిక కేసు.. ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే కొడుకు పేరు ?

జూబ్లీహిల్స్ బాలిక కేసు..  ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే కొడుకు పేరు ?

జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై అత్యాచారం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. ఈ కేసులో నిందితులు వాడిన బెంజ్,ఇన్నోవా కార్లను ఫోరెన్సిక్ అధికారులు రెండోసారీ తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి ఒకరిని రిమాండ్ పంపగా.. ముగ్గురు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు. మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు. బెంజ్ కారు ఫోటోలు బయటకు రావడంతో.. అందులో ఉన్నది పాతబస్తీ ఎమ్మెల్యే కొడుకేనన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.అఘాయిత్యం జరిగింది ఇన్నోవా కారులోనేనని చెప్పిన పోలీసులు.. బెంజ్ కారులో అబ్బాయిలు, అమ్మాయితో ఉన్న వీడియోలు,ఫోటోలు బయటకు రావడంతో భిన్నకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్పెర్మ్ ఆనవాళ్లతో..  బెంజ్ కారులో 15, ఇన్నోవాలో కారులో 25 మెటీరియల్స్ ను సేకరించారు. వీటిని  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ సుదర్శన్ కు క్లూస్ టీమ్స్ అందించాయి.

బాధితురాలి స్టేట్మెంట్..

బాలిక స్టేట్ మెంట్, రెండు కార్లల్లో దొరికిన సైంటిఫిక్ ఆధారాల ప్రాతిపదికన ఎమ్మెల్యే కొడుకు పేరును కేసు ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది.బాధితురాలు అమ్నేషియా పబ్ నుంచి రోడ్ నంబర్ 14లో ఉన్న కాన్ సూన్ పేస్ట్రీ వరకు వచ్చినట్లు గుర్తించి.. పలుమార్లు సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేసి.. ఒకవేళ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలితే అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. వీడియోలోని దృశ్యాలపై.. భరోసా సెంటర్ లో బాధితురాలి స్టేట్మెంట్ ను మరోసారి రికార్డ్ చేశారు.బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం ఉంది. బాధితురాలితో పాటు తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని న్యాయమూర్తి తీసుకున్నారు. నిందితులను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు.

ఇన్నోవా కారును మాయం చేసి..

ఘటన జరిగిన తర్వాత ఇన్నోవా కారును మాయం చేసింది ఓ కార్పొరేటర్ అని ఆరోపణలు వచ్చాయి. ఆ కార్పొరేటర్ కు కూడా నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.అయితే ఇప్పటివరకు ఆ నోటీసులు అందుకున్న వ్యక్తి విచారణకు వచ్చినట్లు కానీ.. నోటీసులు ఇచ్చినట్లు కానీ పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. వీడియోలు, ఫోటోలు  రిలీజ్ అవడంపై పోలీస్ అధికారులు సీరియస్ అయ్యారు. వీడియోను వైరల్ చేసిన ఓ యూట్యూబ్ చానల్ ప్రతినిధిని సైబర్ క్రైమ్ అరెస్టు చేశారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు నిందితుల వీడియోలను సర్క్యులేట్ చేసిన పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ మీడియా పేరుతో అతడు వీడియోలను సర్క్యులేట్ చేశాడని గుర్తించారు. 

మరిన్ని వార్తలు..

1326 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

ఎలక్ట్రిక్ వాహనాల వైపు.. ఢిల్లీ ఎయిర్పోర్టు చూపు