ఎలక్ట్రిక్ వాహనాల వైపు.. ఢిల్లీ ఎయిర్పోర్టు చూపు

ఎలక్ట్రిక్ వాహనాల వైపు.. ఢిల్లీ ఎయిర్పోర్టు చూపు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఓ విప్లవాత్మక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇంకొన్ని ఏళ్లలో విడతల వారీగా విమానాశ్రయంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది. తొలి విడతగా మరో నాలుగు నెలల్లోగా 62 ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి  తేనుంది. వీటి వల్ల ఎయిర్ పోర్టులోని వాహనాల నుంచి వెలువడే  గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు ఏటా దాదాపు 1000 టన్నుల మేర తగ్గుతాయని ఢిల్లీ ఎయిర్ పోర్టు నిర్వాహక సంస్థ తెలిపింది. రన్ వే, ట్యాక్సీ వే, యాప్రాన్ తదితర విభాగాలకు ఎలక్ట్రిక్ వాహనాలు అందుతాయని పేర్కొంది. 2030 సంవత్సరంకల్లా ఢిల్లీ ఎయిర్ పోర్టులో నూటికి నూరుశాతం ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగంలోకి వస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం విమానాశ్రయం పరిధిలో చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఈ విమానాశ్రయంలోని మూడో టెర్మినల్ నుంచి ప్యాసింజర్ ట్రాన్స్ పోర్ట్ సెంటర్ (పీటీసీ) భవనం వరకు ప్రయాణికులను తరలించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు..

గోల్స్ వర్షంతో మెస్సీ అరుదైన రికార్డు

టీఆర్ఎస్ లీడర్లు తాలిబన్లలా వ్యవహరిస్తున్నారు