
జూబ్లీహిల్స్, వెలుగు: మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన రజాక్ బెంగళూరు నుంచి హైదారాబాద్‌కు డ్రగ్స్ తో వస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా పెట్టారు.
బుధవారం హైదారాబాద్‌కు చేరుకుని ఎల్లారెడ్డిగూడలోని వారి ఇంట్లోకి వెళ్తుండగా ఎస్వోటీ, మధురానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 75 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ కలిగిన ఆరు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.