
ఖమ్మం, వెలుగు: అక్రమంగా లింగ నిర్ధారణ టెస్ట్ లు చేస్తుండగా ఒకరిని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం సిటీలోని అన్నవరపు అంజిరెడ్డి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ, ఇంట్లో పోర్టబుల్ స్కానింగ్ మెషీన్ తో అక్రమంగా లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నాడు.
సమాచారం అందడంతో మంగళవారం డీఎంహెచ్ వో కళావతి బాయి, ప్రోగ్రామ్ ఆఫీసర్ సైదులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవి సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని సిటీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి, కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.