లిక్కర్ అమ్ముతానంటూ సోషల్ మీడియాలో యాడ్, యువకుడు అరెస్టు

లిక్కర్ అమ్ముతానంటూ సోషల్ మీడియాలో యాడ్, యువకుడు అరెస్టు

బెంగళూరు: కర్నాటకలో సోషల్ మీడియా ద్వారా లిక్కర్ అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు మాగడి రోడ్డులోని కేహెచ్ బీ కాలనీలో 28 ఏళ్ల కిరణ్ సోషల్ మీడియా ద్వారా మద్యం అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. నిందితుడిని పట్టుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో కాంటాక్ట్ నంబర్ తో పోస్టులు పెట్టేవాడని, ఉన్న రేటు కన్నా మూడు రెట్లు ఎక్కువ రేటుకు లిక్కర్ విక్రయించేవాడని అధికారులు చెప్పారు. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించిన తర్వాతే లిక్కర్ సప్లయ్ చేసేవాడని, తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకునేవాడన్నారు. లిక్కర్ బాటిల్ ను ఒక చోట పెట్టి ఆ స్పాట్ లొకేషన్ ను తన కస్టమర్లకు షేర్ చేసేవాడు. పక్కనే దాక్కుని సరుకు సక్రమంగా అందిందా లేదా అని చెక్ చేసుకునేవాడు. ఫోన్ లో ఆర్డర్ ఇచ్చే వారి వివరాలను ట్రూకాలర్ లో చెక్ చేసుకుని మరీ డీల్ చేసేవాడని అధికారులు చెప్పారు.