కళ్లలో కారం కొట్టినా వెంటాడి దొంగను పట్టుకున్న మహిళ

కళ్లలో కారం కొట్టినా  వెంటాడి దొంగను పట్టుకున్న మహిళ

ఈ మధ్యకాలంలో మహిళలు నగలతో బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. కారణం నగరంలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ లే. తాజాగా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చైన్ స్నాచింగ్ పాల్పడి, వ్యక్తి విఫలమయ్యాడు.  ఇంట్లో టూ లేట్ బోర్డ్ చూసి వచ్చాను రూమ్ చూపించండి అంటూ దుండగుడు బాలాజీ నగర్ లోని ఓ మహిళను మాటల్లో దింపాడు. రూం చుసిన అనంతరం  లాక్ వేసి వెళ్తున్న సమయంలో మహిళ కళ్లలో కారం చల్లాడు. 

ఆ తర్వాత ఆమె మెడలోని 28 గ్రాముల బంగారు పుస్తెల తాడు లాక్కుని స్నాచర్ పరారయ్యాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆ మహిళ.. కళ్లలో కారం మంటను భరిస్తూనే స్నాచర్ ను వెంబడించింది. చివరికి బైక్ పై పరారీ అవుతున్న స్నాచర్ ను  పట్టుకుని... దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ దుండగున్ని పోలీసులకు అప్పగించారు. చైన్ స్నాచర్ ను వెంబడిస్తున్న సమయంలో తనకు గాయాలు కూడా అయినట్టు బాధిత మహిళ తెలిపారు. హయత్ నగర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.