ఒక్క కోన్‌పై 125 ఐస్ స్కూప్‌లు.. ఇటాలియన్ రికార్డ్

ఒక్క కోన్‌పై 125 ఐస్ స్కూప్‌లు.. ఇటాలియన్ రికార్డ్

కప్పు నుంచి తినడం కంటే కోన్ నుండి ఐస్ క్రీం తినడం చాలా రుచిగా, ఎంజాయ్ ఫుల్ గా ఉంటుంది కదా. అందుకే ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్‌ కోన్స్‌ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడతూ ఉంటారు. అయితే అలా మీరు తీసుకున్న కోన్ ఐస్ క్రీమ్ పై ఎన్ని స్కూప్ లు ఉండడం చూశారు.. దాన్నెప్పుడైనా మీరు గమనించారా.. ఒక కోన్‌పై మూడు లేదా నాలుగు కూడా ఉండవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ స్కూప్ లు నిలవడం ఎప్పుడైనా చూశారా.. ఆ కలను నిజం చేయాలనుకున్న ఓ వ్యక్తి.. ఇటీవల అత్యధిక సంఖ్యలో ఐస్‌క్రీం స్కూప్‌లను బ్యాలెన్స్ చేసి రికార్డు సృష్టించాడు. వందకు పైగా ఐస్ క్రీం స్కూప్‌లను బ్యాలెన్స్ చేసి, అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించాడు.

ఇటలీకి చెందిన దిమిత్రీ పాన్‌సియేరా అనే వ్యక్తి ఒక కోన్‌పై 125 రంగురంగుల ఐస్‌ స్కూప్‌లను ఒకదానిపై మరొకటి పెట్టి రికార్డు సృష్టించారు. దీంతో ఆయనుకు గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా దక్కింది. ఇందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌వరల్డ్‌ రికార్డు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CkEZ9BgjcUL/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again