పాములకు స్నానం చేయిస్తున్నాడు.. తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా..

పాములకు స్నానం చేయిస్తున్నాడు.. తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది కదా..

ఓ వ్యక్తి..  రెండు పాములకు (king cobra) స్నానం చేయించాడు. అవి మగ్గుపై కాటేస్తున్నా పట్టించుకోకుండా స్నానం చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో చూసిన వాళ్లు.. షాక్ అవుతున్నారు. ఎమోషన్లతో  కామెంట్ సెక్షన్‌ను నింపేస్తున్నారు. అంతేకాదు ఆ వీడియోని తెగ లైక్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. 

హిందూ మతంలో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ మాసంలో భక్తులు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు.  ఇక నాగుపామును సాక్షాత్తు శుభ్రమణ్యేశ్వరుడు, నాగేంధ్రస్వామి అని భావిస్తుంటారు.  నాగుల చవితి రోజున అవి పుట్టలో ఉంటాయని భావించి పాలు కూడా పోస్తుంటారు. ఇక శ్రావణ మాసంలో నాగుపాములు ( Kind Cobra) కనిపిస్తే పాలు, అన్నం పెట్టాలని చెబుతుంటారు.  ఇలా చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శ్రావణ మాసంలో ప్రత్యక్ష పాము కనపడితే పాలు పోసి జలాభిషేకం చేస్తే అంతా శుభమే జరుగుతుందంటారు.   ఇది శివుని మెడలోని దండగా కూడా ఉంటుంది.  

 ఇప్పుడు  షింటూ అనే వ్యక్తి పాములకు మగ్గుతో స్నానం చేయిస్తున్న వీడియోను అతని ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.  ఈ వీడియోలో ఆ వ్యక్తి రెండు నాగు పాముల తలలపై నీరు పోయడం కనపడుతుంది.  నీళ్లు పోసేటప్పుడు అవి డ్యాన్స్ చేయడం స్పష్టంగా కనపడుతుంది.మొదట్లో రెండు పాములు ఒకే చోట నిద్రపోతున్నట్లుగా ఉన్నాయి. షింటూ అనే వ్యక్తి మగ్గుతో వాటి తలలపై నీరు పోయగా అవి డ్యాన్స్ చేశాయి,  ఈ వీడియో కు 24 వేల కంటే ఎక్కువ మంది వీక్షంచగా.. 13 వేల లైక్ లు వచ్చాయి.