రూ.62కు ఉబర్ ఆటో బుక్ చేస్తే.. 7 కోట్లకు పైగా బిల్లు

రూ.62కు ఉబర్ ఆటో బుక్ చేస్తే.. 7 కోట్లకు పైగా బిల్లు
  • ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఘటన

న్యూఢిల్లీ: ఉబర్ ఆటో బుక్ చేసిన కస్టమర్..​ డెస్టినేషన్ కు చేరుకున్నాక బిల్లు చూసి షాకయ్యాడు. రూ.62 కట్టాలని ముందుగా చూపించిన యాప్.. తీరా రైడ్ పూర్తయ్యాక రూ.7 కోట్లకుపైగా కట్టాలని చూపించడంతో పరేషాన్ అయ్యాడు. తనకు వచ్చిన బిల్లును వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్​లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా రెగ్యులర్​గా వెళ్లే ప్లేస్​కు ఉబర్​ యాప్​లో ఆటో బుక్ చేసుకున్నాడు. 

ముందుగా రూ.62 చూపించిన యాప్.. లొకేషన్​కు చేరుకున్నాక రూ.7,66,83,762 కట్టాలని వచ్చింది. మొత్తం బిల్లులో ట్రిప్ ఫేర్​గా రూ.1,67,74,647, వెయిటింగ్ చార్జ్ కింద రూ. 5,99,09189 వేసి, 75 రూపాయలను ప్రమోషన్ చార్జ్​కింద తీసేశారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన దీపక్.. తనకు యాప్​లో చూపిస్తున్న బిల్లును వీడియో తీసి తన ఫ్రెండ్​కు షేర్ చేశాడు. ఆయన ‘‘నా ఫ్రెండ్ చంద్రయాన్​కు ట్రిప్ బుక్ చేసుకున్నా ఇంత బిల్లు పడేదికాదు”అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ క్లిప్ వైరల్ కావడంతో ఉబర్ సంస్థ స్పందించింది. కస్టమర్​కు సారీ చెప్తూ బిల్లును అప్​డేట్ చేస్తామని ప్రకటించింది.