సహజీవనం ఒకరితో.. పెండ్లి మరొకరితో..

సహజీవనం ఒకరితో.. పెండ్లి మరొకరితో..

పెండ్లి చేసుకుంటానని ఓ అమ్మాయిని నమ్మించి మోసగించాడు ఒకతను. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.  సుధాకర్(25) అనే అతను మహబూబ్ నగర్ టౌన్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అదే నగరంలోని గగన్ ఫహాడ్ మెట్రోషాపింగ్ మాల్ లో  22ఏళ్ల అమ్మాయి పనిచేస్తుంది. కొన్నిరోజులుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ సుధాకర్ వెంటపడ్డాడు. ఇందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. అయితే అదే ఊరికి చెందిన కొందరు సుధాకర్ వేధిస్తున్నట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. సుధాకర్ ను నిలదీయగా.. తాను ఆ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు సుధాకర్ ప్రపోజల్ ను అంగీకరించారు. అప్పటి నుంచి సుధాకర్ ఆ అమ్మాయితో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు.

కొంతకాలం నుంచి… శంషాబాద్ లో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఆ అమ్మాయితో సహజీవనం సాగించాడు సుధాకర్. రోజులు గడుస్తున్నా పెళ్లి విషయం సుధాకర్ ప్రస్తావించకపోయే సరికి ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఒక రోజు సుధాకర్ ను నిలదీయగా.. తన ఇంట్లో కట్నం లేకుండా పెండ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంలేదని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే సుధాకర్ వేరే అమ్మాయితో పెండ్లికి రెడీ అయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.