మనుషుల్ని వేటాడుతున్న పులిని చంపేశారు

మనుషుల్ని వేటాడుతున్న పులిని చంపేశారు

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఇటీవల తొమ్మిది మందిని చంపిని నరమాంస భక్షక పులిని అధికారులు ఎట్టకేలకు చంపేశారు. పలువురి ప్రాణాలను హరించిన ఈ పులిని పట్టుకునేందుకు విఫలయత్నమైన అధికారులు.. దాన్ని చంపాలని ఆదేశాలివ్వడంతో పులి వేట కథకు ముగింపు పలికింది. బగహా ప్రాంత వాల్మికి కొన్ని రోజులుగా టైగర్ రిజర్వ్ అడవుల గ్రామాలను వణికిస్తోంది. ఈ పులిని పట్టుకునేందుకు రెస్క్యూ బృందం నానా తంటాలు పడింది.

మనిషి రక్తం రుచి మరిగిన ఈ పులి నెల రోజుల్లోనే ఐదుగురి ప్రాణాలు తీసింది. ఈ మధ్య కాలంలో కేవలం మూడు రోజుల్లోనే నలుగురి ప్రాణాలు బలి తీసుకుంది. దీంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించారు. దీన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారు. దీంతో విసిగిపోయిన అధికారులు ఇటీవలే ఈ పులిని చంపేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ పులిని అంతచేయడంతో అక్కడి గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి.